మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్.
ప్రతిపక్షం. కోహెడ. అక్టోబర్ 31: ఈరోజు కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి శ్రీ ఇందిరా గాంధీ 42 వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేసిన ఉక్కుమహిల శ్రీమతి ఇందిరా గాంధీ విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించిన దార్శనికురాలు అని అన్నారు. తన దేహం ముక్కలైన సరే భారతదేశం విచ్చిన్నం కాకూడదని అలుపెరుగని పోరాటం చేసి ఉక్కు మహిలాగా ప్రఖ్యాత గాంచారన్నారు.ఇప్పటికి ఆమె చేసిన సేవలు పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచాయి కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగానే పని చేస్తోందని అందుకే పేద ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపేలా శ్రీమతి శ్రీ ఇందిరా గాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తుందని అన్నారు.
రానున్న రోజుల్లో కూడా ఈ ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగానే పని చేస్తోందని,కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మరియు మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఐక్యంగా పని చేసి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పని చేసి వారికి నిజమైన ఘన నివాళులు అర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ లు,సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు,గౌరవ సర్పంచ్ లు,ఆయా గ్రామాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






























