*పోలీస్ అమరవీరుల స్మరణలో వ్యాసరచన పోటీల నిర్వహణ .
*6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మండల స్థాయి పోటీలు.
*ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
*సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 30 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే–2026 సందర్భంగా మునుగోడు మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణలో పౌరులు, పోలీసుల పాత్ర, మాదకద్రవ్యాల బెడద–నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన విధానం తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు ఎస్‌ఐ శోభన్‌బాబు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్‌ఐ శోభన్‌బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో తల్లమల్ల మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు కే. బాలప్రసాద్, కార్యక్రమ హోస్ట్ కుడతాల రత్నయ్య, ఉపాధ్యాయులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న, గంగావతి, సదా లక్ష్మి, వెంకటేశ్వర్లు, చంద్రం, సుధాకర్‌రెడ్డి, జాల నాగమణి, సత్తిరెడ్డి, నాగరాజు, సతీష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.





























