ప్రజల సమస్యల పరిష్కారమే సిటిజన్ ఫోరం లక్ష్యం.. మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బి కొండల్ రెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 27: మెదక్ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం చేయడం కోసం నిరంతరం మెదక్ సిటిజన్ ఫోరం పని చేస్తుందని సమస్యలను జిల్లా అధికారుల కు. రాజకీయ నాయకులకు తెలియజేస్తూ వాటిని పరిష్కరించే దిశగా మెదక్ సిటిజన్ ఫోరం పనిచేస్తుందని సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలిపారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మెదక్ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణంలో విద్యుత్ కోత వలన పట్టణ ప్రజలు మెడికల్ కాలేజీ విద్యార్థులు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు మాత శిశు సంరక్షణ వైద్యశాల లోని రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ కోతలను నివారించాలని.మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి అత్యవసర వైద్య సేవలు కొరకు హైదరాబాదు లోని ప్రైవేటు ఆసుపత్రులకు వైద్యం చేయించుకుని ఖర్చులు పాలవుతున్న పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని.మెదక్ పట్టణ కేంద్రంలో గల పశువైద్యశాల శిథిలావస్థలో పనిచేయుచున్నది దీనికి నూతన భవనాన్ని నిర్మించాలని.మెదక్ పట్టణంలో గల ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాల శిథిలావస్తకు చేరినందును నూతన భవనాన్ని నిర్మించాలని, మెదక్ పట్టణ డ్రైనేజీ మరియు వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని. మరణించిన మరియు అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం బాధ్యులు పి.డి. ఆనందం, వై. నాగభూషణం, కానుగు రాజశేఖర్ ,బాలేష్ గౌడ్, డీ.జీవరత్నం, ఎస్. విద్యాసాగర్, భాస్కర్ రెడ్డి ,కే. బాగయ్య లు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News