[t4b-ticker]

కూరగాయల వ్యాపారులకు పెద్ద గొడుగుల పంపిణీ

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: రాంనగర్ ప్రాంతంలోని కూరగాయల వ్యాపారులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పిస్తూ, వారి వ్యాపారానికి అనుకూలంగా ఉండేలా అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు మరియు వాసుదేవా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద గొడుగులను తయారు చేయించి ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు స్వదేశీ ఆర్గనైజేషన్ యొక్క సేవా కార్యక్రమాలు, లక్ష్యాలను వివరించారు. రెండో విడతలో కట్టరాంపూర్, భగత్‌నగర్ ప్రాంతాల్లోని మరికొంతమంది కూరగాయల వ్యాపారులకు కూడా గొడుగులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి గొడుగుల దాతలుగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ – వాసుదేవా హాస్పిటల్, బత్తిని శ్రీనివాస్ – చార్టర్డ్ ప్రెసిడెంట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, కొంజర్ల మహేష్ మరియు ఇంజనీర్ కోల అన్నారెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, కొంజర్ల మహేష్, బత్తిని శ్రీనివాస్, సెక్రటరీ గుగ్గిల్ల సత్యం, ట్రెజరర్ కే. అంజిబాబు, వైస్ ప్రెసిడెంట్ అర్జిత్ సింగ్, కుదుజ్, రాజేశం, శ్రీకాంత్, శంకర్, శ్రీనివాస్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, పండుగ నాగరాజు, సాగర్ రెడ్డి, ప్రసాద్, గాలిపెల్లి నాగేశ్వర్, చెరిమల వెంకటేశ్వర్లు, అల్లాడి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News