ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆధ్యాత్మిక వైభవం.
కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు
భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా మహా పడిపూజ నిర్వహించడం ఆనందదాయకం.
బిఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 19 : శరణుఘోషలతో.. అయ్యప్ప నామస్మరణతో.. భక్తిపారవశ్యంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గురువారం ఆయన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించడంతో పాటు అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.ఈ మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. వారితోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఇంతటి భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. అయ్యప్ప స్వామి నామస్మరణ, పడిపూజ వంటి పవిత్ర కార్యక్రమాలు మనలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.































