అభివృద్ధి పనుల్లో నిధుల దుర్వినియోగం

  • కలెక్టర్‌కు కాశీoనగర్ గ్రామస్థుడి ఫిర్యాదు

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 09, ప్రతిపక్షం: గ్రామ అభివృద్ధి పనులు, రక్షిత మంచినీటి పథకం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం కాశీoనగర్ గ్రామానికి చెందిన రేవల్లి రాములు సోమవారం ప్రజావాణిలో జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఖిమ్యా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పనులు తక్కువగా చేసినప్పటికీ అధిక మొత్తంలో బిల్లులు చూపించి నిధులు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల రూ.1,02,854 నిధులు డ్రా చేయడంతోపాటు బస్టాండ్ సమీపంలో, తండాలో గుంతల రోడ్లకు మట్టి వేసినట్లు చూపించారని తెలిపారు. రక్షిత మంచినీటి పథకం నిధులతోపాటు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన నిర్మాణానికి కూడా ప్రభుత్వ నిధులు వినియోగించినట్లు ఆరోపించారు. పనుల కొలతలు, బిల్లులు, చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపించి, అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Related News

Latest News