కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి -2

సైబరాబాద్, ప్రతిపక్షం,అక్టోబర్ 31: సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్, వార్షిక తనిఖీల్లో భాగంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ, స్టేషన్ రికార్డులు, అధికారుల పనితీరు, ట్రాఫిక్ విధుల అమలు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణ, రహదారులపై సాఫీగా వాహనాల రాకపోకలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడీసీపీ ట్రాఫిక్-2 వీరన్న, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ తిమ్మప్పతో పాటు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News