*సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి .*సిలిండర్లు, గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
*నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి – పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
ప్రతిపక్షం – చండూరు, అక్టోబర్ 27: మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ AITUC నాయకులు చండూరు ఆర్డీవోకి మెమోరాండం సమర్పించారు.రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల వెంకటేష్, సహాయ కార్యదర్శి దోటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందించారు.
కార్మికులకు నెలకు రూ.10 వేల జీతం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు, జీతాలు వెంటనే చెల్లించాలని, సిలిండర్లు, గుడ్లను ప్రభుత్వమే పంపిణీ చేయాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో AITUC వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల శ్రీనివాసులు మండల అధ్యక్షుడు భూతరాజు దేవదాసు కోలా మంగమ్మ, పేర్ల రాజమ్మ, దేవసరి రేణుక, చొల్లేటి రమ్య, దోమల దనమ్మ , గుణగోని లక్ష్మీ ,మేకల లింగమ్మ, వర్కాల సావిత్రి, బి చంద్రమ్మ, మల్లిక,డి మంగమ్మ, యం రాణి, పేర్ల రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.





























