మాధవనగర్ ఆర్ వో బీ పనులు పూర్తి చేయాలి

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ అక్టోబర్ 27: నిజామాబాద్ నగర శివార్ మాధవ నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ వో బీ) పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఇందూర్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఆర్ వో బీ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే జరిగిన ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఆర్ వో బీ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. బ్రిడ్జి కింద రోడ్డు బాగు లేకపోవటంతో నిత్యం వాహనదారులు నరకయాతన పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ ఆర్ వో బీ నిర్మాణం పనులపై బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం రాజకీయం కొరకు కాదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలు తీర్చడానికి దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, బీజేపీ కార్పొరేటర్లు, నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వివిధ సంఘాలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News