[t4b-ticker]

మహేశ్ బాబుకు బర్త్‌డే గిఫ్ట్.. ‘వారణాసి’ నుంచి అదిరిపోయే అప్డేట్!

ప్రతిపక్షం, ఆగస్టు 09: సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్ వచ్చింది. సినిమాలో మహేశ్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన ప్రత్యేక స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హాలీవుడ్ ప్రమోషన్ పేజ్ ‘ఎక్స్‌’లో ఈ ఫొటోలను షేర్ చేయగా.. ‘వారణాసి’ చిత్రబృందం వాటిని రీపోస్ట్ చేసింది.

ఈ స్టిల్స్‌లో మహేశ్ బాబు హ్యాండ్సమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫ్రేమ్స్ ఇవేనని దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేర్కొన్నట్లు సమాచారం. “ఇవి ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫ్రేమ్స్. వీటి ముందు ఐమ్యాక్స్ ఫ్రేమ్ కూడా నిలబడలేదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మహేశ్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన స్టిల్స్‌తో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Spread the love

Related News

Latest News