[t4b-ticker]

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 19: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయతీ భవనం ముందు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల భాగ్యలక్ష్మి క్రాంతి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News