ధర్మేంద్రకు సత్కారమా? BJPపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 28: ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంటులో బీజేపీ ఎంపీలు ఘన స్వాగతం పలకడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని, దేశ విద్యావ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. నైతిక బాధ్యతతో కాదు, విద్యార్థి యువత ఆగ్రహానికి భయపడి ఆయన రాజీనామా చేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని బీజేపీ సత్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన చర్యలను వేడుక చేసుకుంటోందని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఈ పరిణామాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News