[t4b-ticker]

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి.. వధూవరులకు ఆశీస్సులు

ప్రతిపక్షం, ఆగస్టు 16, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వధూవరులతో కొద్దిసేపు ముచ్చటించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక సందడిగా సాగింది. సీఎం రాకతో కార్యక్రమంలో ప్రత్యేక సందడి నెలకొంది. వివాహానికి హాజరైన ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News