నాలుగు రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర
నేడు కేసీఆర్ ను కలవనున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 19: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర నేడు నాలుగో రోజు చేరుకుంది ఈరోజు గజ్వేల్ నుండి పాదయాత్ర మొదలైంది సోమవారం ఏడుపాయల వనదుర్గమాత ఆలయం నుండి మెదక్ జిల్లా కేంద్రం నుండి.చిన్న శంకరంపేట్.చేగుంట. మకరాజుపేట కర్ణంపల్లి ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గజ్వేల్ కి చేరుకుంది నేడు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు అనంతరం మధ్యాహ్నం సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాదయాత్రగా వచ్చిన నాయకులను కార్యకర్తలను కలుస్తారు ఈ పాదయాత్రలో చిన్న శంకరంపేట పేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్. కల్వకుంట్ల సర్పంచ్ అందే కొండల్ రెడ్డి భారత రాష్ట్ర సమితిని యువ నాయకుడు నవీన్. అజ్మీరా స్వామి నాయక్. తో పాటు శంకరంపేట-ఆర్ మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రజక్పల్లి సర్పంచ్ కనకరాజు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, మావురం రాజు, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు వినయ్, ప్రవీణ్, సల్మాన్, నగేష్, అంతేలి.నాగరాజు, కనుక రాజు,స్వామి, రాజు, శేఖర్, శ్రీకాంత్, సాయి, నరేష్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






























