సేవాలాల్ ఆలయ వార్షికోత్సవానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి ఆహ్వానం

ఈ నెల 11న రాజపేట తాండలో ఆలయ పంచమ వార్షికోత్సవం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 09: హవేలి ఘనపూర్ మండలంలోని రాజపేట తాండ గ్రామంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ జగదాంబ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ పంచమ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.ఈ మేరకు సోమవారం మాజీ సర్పంచ్ కిషన్, బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, మాజీ సర్పంచ్ యామిరెడ్డి, నాయకులు సాయిగౌడ్, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News