*కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ.
*ఈ నెల 11 నుండి 20 వరకు ఘనంగా అమ్మవారి ఉత్సవాలు.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 10: చండూరు పట్టణంలోని ప్రసిద్ధ మార్కండేశ్వర ఆలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ ఆలయంలో నిత్యం అమ్మవారికి చండూరులో నేసిన ఇక్కత్ చీరలు అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ దాతలుగా చెరిపల్లి భిక్షమయ్య-శోభ దంపతులు, వారి కుమార్తె డా. హరిణి, నవరాత్రులలో కంకణధారులకు అన్నప్రసాద దాతగా కర్నాటి విద్యాసాగర్-కరుణశ్రీ, నిత్య పులిహార సమర్పణ జులూరు కృష్ణయ్య-పద్మ వ్యవహరిస్తున్నారు.
ఇక్కత్ చీరల దాతలు గంజి యాదగిరి-యశోద, జూలూరు ఆంజనేయులు-పద్మ, జూలూరు శ్రీనివాసులు-సునీత, చిలుకూరి శ్రీనివాసులు-రాధిక, పగిడిమర్రి శ్రీనివాసులు-జయలక్ష్మి, చిలుకూరి నర్సింహ్మ-లక్ష్మమ్మ, చెరపల్లి అంజయ్య-యాదమ్మ, కలిమికొండ మహేష్-గిరిజ, పద్మావతి హ్యాండ్లూమ్స్ (యేశాల హరీష్).
నిత్య పూల దండల దాతలు గుర్రం భిక్షమయ్య, కోమటి వీరేశం, అర్చక దాత పాల్వాయి స్రవంతిరెడ్డి, హోమ సామగ్రి దాత కోడి వెంకటేశం-కళమ్మ, పూజా సామాగ్రి దాత జూలూరు శేఖర్-వరలక్ష్మి, అమ్మవారికి నిత్య లడ్డూల దాతలు ఏలె శ్రీనివాసులు, కోడి శివశంకర్, వస్తురూపేణ దాతలు కటకం రమేష్, ఏలె శ్రీనివాసులు, జూలూరు వెంకటేశం.
పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఉత్సవ కమిటీ వద్ద పేరు నమోదు చేసుకోవాలని, అలాగే అమ్మవారి చీరల వేలం పాటలో ఆసక్తి గల భక్తులు తమ పేరును 9985041123, 8885440002, 9885751117, 8142246328 నెంబర్లకు సంప్రదించాలని ఆలయ చైర్మన్ రావిరాల నగేష్ తెలిపారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, పద్మశాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, గౌరవ సలహాదారులు కోడి గిరిబాబు, అధ్యక్ష కార్యదర్శులు గుర్రం భిక్షమయ్య, గంజి శ్రీను, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, కౌన్సిలర్ కోడి సుష్మ వెంకన్న, ఆలయ చైర్మన్ రావిరాల నగేష్, చెరుపల్లి అంజయ్య, గంజి యాదగిరి, కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకన్న, సీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, చేనేత సహకార సంఘం ప్రధాన కార్యదర్శి గంజి అశోక్, కోశాధికారి కోమటి ఓంకారం, డైరెక్టర్లు ఏలె శ్రీనివాసులు, జూలూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.




























