ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌ పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్.

— నూతన సాంకేతిక వ్యవస్థలపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

— వార్షిక తనిఖీల్లో భాగంగా మెట్ పల్లి, పోలీస్ స్టేషన్‌,ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 16: పోలీస్ శాఖలో సేవల నాణ్య తను మరింత మెరుగుపరచ డం,ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడం, నేరాల నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు నాణ్యత, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్, ఈరోజు మెట్ పల్లి, పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి తనిఖీ నిర్వ హించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవు తున్న కేసులు, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు విధానం, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీ లించారు. ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించి, నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులు,సిబ్బంది విధుల కేటాయింపు, కార్యా లయ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితు లకు సత్వర న్యాయం అందే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.5S, విధానం లో భాగంగా పోలీస్ స్టేషన్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ సిబ్బంది యూనిఫాం నీట్ టర్న్‌అవుట్‌,తో ఉండాలని, క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఎస్పీ, సూచించారు. డయల్–112, కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి, సంఘటన స్థలా నికి అత్యంత వేగంగా చేరు కుని బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నేరాల నివార ణకు కృషి చేయాలని సూచించారు.

విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటా యించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సి.సి, కెమె రాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో కలిగే ప్రయో జనాలపై ప్రజలకు విస్తృ తంగా అవగాహన కల్పించా లని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల భద్రత, మోసగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులపై ప్రజలను చైతన్యపరిచి, అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్, ఆవరణలో జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, రాములు, ఇన్స్పెక్టర్, లు సురేష్ బాబు, శ్రీనివాస్, ఎస్.ఐ, లు కిరణ్ కుమార్, అనిల్, రాజు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News