తొమ్మిది రోజులుగా వివిధ రూపాల్లో దర్శన మిచ్చిన దుర్గమాత.
ప్రతి పక్షం చండూర్ అక్టోబర్ 22: చండూర్ మండలం నెర్మట గ్రామంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజువివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో కొండాపురం సర్పంచ్ గిరి కరుణాకర్, దొంతరగోని నర్సింహా, సంధినేని శ్రీనివాసరావు, గిరి లింగంగౌడ్, అయితగోని సుధాకర్ గౌడ్, కట్టా స్వామి, బుర్కల శేఖర్,కట్టా శివానంద్, కాట్ట ఈశ్వర్, బండమీది పరమేష్,నారపాక అజయ్, దాసరి రాంబాబు, బండమీది శివ, నారపాక శంకర్, నారపాక వినయ్, నాగిళ్ల పవన్, నాగిళ్ల యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.






























