కోనాయిపల్లి దళితుల న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

దళితులపై సొమూహికదాడి చేసిన సర్పంచ్ తదితరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 22: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పీటీ కొనాయిపల్లి లో బతుకమ్మ వేడుకల్లో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వివిధ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో.సిపిఎం డిబిఎఫ్.కేవీపీస్.జాతీయ మాల మహానాడు. కోనాయిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. సీపీఎం కెవిపిఎస్.డిబిఎఫ్.నాయకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ నాడు దళితులు డప్పులు కొట్టాలని పిలిచి వారు కనీస వేతనం ఇవ్వాలని అడిగిన పాపానికి దళితులపై దాడికి దిగిన కోనాయిపల్లి పిటి సర్పంచ్ కళ్యాణ్. అతని అనుచరులు కర్రలతో సామూహిక దాడి చేశారని ఆరోపించారు.

కోనాయిపల్లి లో డప్పులు కొట్టడానికి మాదిగ కులస్తులని గ్రామ సర్పంచ్ అయిన మన్నే కళ్యాణ్ పిలిచి మాట్లాడగా మాదిగ కులస్తులు రావెల్లి ప్రవీణ్ ,నరసింహులు నిరంజన్ తదితరులు మాట్లాడడానికి వెళ్లగా వారు 8000 వేతనం అడగగా సర్పంచ్ పాతవేతనం ప్రకారమే 3000 వేలు ఇస్తామని అనగ దళితులు డప్పులు కొట్టమని వెనుతిరిగిపోవడంతో అగ్రహానికి గురైన సర్పంచ్ వారిని అవమానపరిచి మీరు డప్పులు కొట్టకపోతే పండుగ జరగదా మేము చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మను తీసుకుపోతాము అని వారిని తిరిగి పంపించేశారన్నారు. ఈ క్రమంలో గ్రామ నాయకుడు విటల్ రెడ్డి జోక్యం చేసుకొని వాళ్ళు ఇవ్వక పోతే నేను ఇస్తాను మీరు వెళ్లి డప్పులు కొట్టండి అని చెప్పగా. బతుకమ్మ పండుగ నాడు డప్పులు కొట్టడానికి బయలుదేరాగా బతుకమ్మ వద్దకు వెళ్ళగా అక్కడ వేరే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తులు బ్యాండు కొట్టడం చూసి. మా గ్రామంలో మేము డప్పులు కొడతామని మీరు కొట్టకండి అని అడిగార న్నారు. దానికి సర్పంచ్ మధ్యలోకి వచ్చి మీరు ఎవరురా చెప్పేదీ మాదిగ కొడకల్లారా అని మాట మాట వాగ్వాదం పెరిగి మాదిగల పైకి దాడికి దిగారనీ వివరించారు.

గ్రామపంచాయతీ సిబ్బంది చేతుల్లోని కర్రలు లాక్కొని మాదిగ కులస్తులైన ప్రవీణ్ నరసింహులు ,నిరంజన్ శ్రావణి తదితరుల పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.ఆరోజు రాత్రి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు రాయగ నిందితుల పైన పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మరియు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. కానీ బాధితుల ఫిర్యాదు పై చేయకుండా పోలీసులు వాళ్ల సొంత ఫిర్యాదులను రాసి కేసులు నమోదు చేసినట్టుగా బాధితులు తెలియజేశారని వివరించారు. దళితులపై సామూహిక దాడి జరిగిన తర్వాత నేటి వరకు డిఎస్పి , రెవెన్యూ అధికారులు సందర్శించలేదని, బాధితులను ఆస్పత్రికి సైతం తరలించలేదని,బాధితులకి రక్షణ కల్పించడంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ లు రాసి సాదాసీదా సెక్షన్లు మాత్రమే ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేశారని ,ఫిర్యాదులో లో ఎక్కడ కూడా గాయాల వివరాలు వ్యక్తుల వివరాలు ఏ వ్యక్తికి ఏ గాయమైందని వివరాలు ఇక్కడ నమోదు కాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని నేరస్తుల పక్షాన వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుందని వెంటనే డీఎస్పీ వచ్చి బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని డిమాండ్ చేశారు.

నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని బాధితులకు ఎమ్మెల్సీ చేయించాలని గ్రామానికి వచ్చిన ఎస్సై సుభాష్ గౌడ్ కు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదు కాకుండా పోలీసులే ఫిర్యాదు రాయడం నిందితులకు అనుగుణంగా సెక్షన్లు పెట్టడం తగదని ఆల్టరేషన్ చేయాలని ఎస్సైని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు. కోనాయిపల్లి సర్పంచ్ పై వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు అడివయ్య సిఐటియు నాయకులు మల్లేశం. జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ్ రాష్ట్ర నాయకులు అశోక్ కోనపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News