ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు.
ప్రతి పక్షం చండూరు , అక్టోబర్ 05: మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరి వారి గూడెం గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న తాగునీటి ఎద్దడికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నీటి సమస్యకు తెరపడింది.గ్రామంలో వేసవి కాలం నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న బోర్లు ఎండిపోవడం, వర్షాలు సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ జాల వెంకన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సహకారంతో గ్రామంలో నూతన బోరు వేయించారు. ఆదివారం బోరు పనులను ప్రారంభించారు. బోరులో సమృద్ధిగా నీరు పడటంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్యను పట్టించుకున్న వారు లేరని, తమ సమస్యను చెప్పగానే వెంటనే స్పందించి బోరు వేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా గ్రామ అభివృద్ధికి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాల వెంకన్న, వార్డు మెంబర్ చొప్పరి శివ శంకర్, అరుణాచలం, చొప్పరి లింగస్వామి తదితర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





























