విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటనపై విచారణ

ప్రిన్సిపాల్‌తో పాటు టీచర్ సస్పెన్షన్‌

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 08: గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ‘ప్రతిపక్షం’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి, విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు తేలడంతో ప్రిన్సిపాల్ రజినీ, పీజీటీ డి.శ్రీలతలను సస్పెండ్ చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు.విద్యార్థినిపై అమానుషంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నివేదిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తోపాటు గిరిజన గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మికి పంపనున్నట్లు తెలిపారు.

Spread the love

Related News

Latest News