— ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
— కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మెట్ పల్లి, పోలీస్ స్టేషన్ పరిధిలోని 5, గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 35 సి.సి, కెమెరాల ప్రారంభం, పోలీస్ స్టేషన్ కు అనుసంధానం.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 16: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల ఛేదనను మరింత సమర్థవం తంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5, గ్రామంలో ఏర్పాటు చేసిన 35, సి.సి కెమెరాలను,పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ, మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సి.సి, కెమెరాలు ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి, ప్రతి వ్యాపార సంస్థకు అదనపు భద్రతను కల్పించే సమర్థవంతమైన సాధనంగా మారాయని అన్నారు. నేరాలను అరికట్టడంలో, నేరస్థులను గుర్తించి త్వరితగతిన పట్టుకోవడంలో సీ.సీ, కెమెరాల ద్వారా లభించే దృశ్యాలు అత్యంత కీలకమైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో సి.సి, కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాందో ళనలు ఏర్పడి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదా లు, చోరీలు, గొడవలు,జరిగే నేరాలు మరియు ఇతర సంఘటనల విచారణలో సి.సి, కెమెరాల ఫుటేజీ కీలక సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ వ్యక్తిగత భద్రతతో పాటు తమ రక్షణ కోసం ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థ, దుకాణం, అపార్ట్మెంట్ మరియు ఇతర ప్రాంగణాల్లో సీ.సీ, కెమెరాలు ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. మెట్ పల్లి, పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గసాగర్, (10), మెట్ల చిట్టాపూర్, (06), అరపేట, (04), విట్టెంపేట, (09), బంటు పేట్,(06) గ్రామంలో ఏర్పాటు చేసిన 35, సీ.సీ, కెమెరాలు గ్రామ భద్రతను మరింతబలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొంది స్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్ పల్లి, మండ లంతో పాటు పరిసర గ్రామా ల ప్రజలు కూడా స్వచ్ఛందం గా సీ.సీ, కెమెరాలను ఏర్పాటు చేసుకొని తమ గ్రామాలను మరింత సురక్షి తంగా తీర్చిదిద్దాలని కోరా రు. అలాగే ఎవరైనా అను మానాస్పద వ్యక్తులు, వాహ నాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్-112, లేదా సమీప పోలీస్ స్టేషన్,కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో డీఎస్పీ, రాములు, ఇన్స్పెక్టర్ లు సురేష్ బాబు, శ్రీనివాస్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, రాజు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.





























