పత్తి రైతులు అప్రమత్తంగా ఉండండి – పొలాల్లో పత్తి బస్తాలు చోరీ

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 09 : చండూర్ మండలం పుల్లెంల గ్రామంలో పత్తి దొంగతనం కలకలం రేపింది. నిన్న రాత్రి గుర్తు తెలియని దొంగలు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద నిల్వ ఉంచిన పత్తి బస్తాలను ఎత్తుకెళ్లారు.కౌలు రైతులు నకిరికంటి లింగస్వామి మరియు చంద్రయ్య (స్వి. కారింగు ముత్తయ్య భూమిలో సాగు చేస్తున్న) కు చెందిన సుమారు 4 క్వింటాళ్ల పత్తి చోరీకి గురైంది. 3-4 మంది దొంగలు ఈ చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పుల్లెంల గ్రామ రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.పొలాల వద్ద పత్తి బస్తాలు, వ్యవసాయ పనిముట్లు, ఎడ్లను రాత్రి వేళ ఉంచవద్దు. పగటి పూటే పత్తిని ఇంటికి తరలించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల వైపు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే గ్రామ పెద్దలకు మరియు చండూర్ పోలీసులకు సమాచారం అందించగలరు. గ్రామంలో రాత్రి కాపలాను మరింత పటిష్టం చేయాలి.రైతులు పండించిన పంటను కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు .

Spread the love

Related News

Latest News