*గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ప్రతి పక్షంనల్గొండ నవంబర్ 08:చండూరు మండలం కస్తాల గ్రామంలో ‘ఇంటింటికీ దీపావళి’ వేడుకలు గ్రామపంచాయతీ సర్పంచ్ లేదన్న సత్యం గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామస్థులతో కలిసి దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ప్రజల మధ్య దీపావళి కాంతులను నింపారు.కార్యక్రమంలో భాగంగా కస్తాల గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా గ్రామానికి చెందిన బొమ్మరబోయిన కలమ్మ, పందిరి రాదా, చిలుకూరి కమల, భూతం వెంకటేశం, సరిపెల్లి వెంకట్ రాములు గృహాలను ఆయన స్వయంగా సందర్శించారు. ఆయా ఇళ్లలో మహిళలు సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక పూజలు మరియు వేడుకల్లో కలెక్టర్ చురుగ్గా పాల్గొన్నారు. స్వయంగా ప్రమిదల్లో దీపాలు వెలిగించి, పండుగ విశిష్టతను చాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే దీపావళి పండుగ అందరి జీవితాల్లో సరికొత్త కాంతులు, ఐశ్వర్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నేరుగా తమ ఇళ్లకు వచ్చి, తమతో కలిసి పండుగ జరుపుకోవడంపై లబ్ధిదారులు మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణాన్ని పెంపొందించడం మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ ప్రత్యేక దీపావళి సంబరాల కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం, చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కల్మికొండ మల్లేష్, నాతల విష్ణువర్ధన్ రెడ్డి, ఎఫ్ ఎస్ సి ఎస్ సి బ్యాంక్ డైరెక్టర్ కట్టాభిక్షం,
చండూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంటకంపు అశోక్, పంగ రామకృష్ణ, గుండమల్ల నరసింహ, బోనాల శ్రీనివాస్ రెడ్డి, గురిజాల స్వామి, భూతం వెంకటేశం, మెరుగు అంజయ్య, జాల రవీందర్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





























