ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 03: మెదక్ మండలం మక్త భూపతిపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మద్దగుంట నర్సింలు (56) రోజువారీగా ఉపాధి హామీ పనులకు వెళ్లి విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో తోటి కూలీలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు గ్రామ సర్పంచ్ పవన్ కోరుతున్నారు.



























