[t4b-ticker]

‘మల్లెపూల పల్లకి’ పాటపై విమర్శలు.. స్పందించిన శివ నిర్వాణ

ప్రతిపక్షం, ఆగస్టు 18: ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాటపై వస్తున్న విమర్శలకు దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. పాటలో గాయకుడి స్వరం సరిపోలలేదన్న విషయం చిత్రబృందానికి ముందే తెలుసని ఆయన తెలిపారు. అయితే అసలు పాట విడుదలై 15 ఏళ్లకు పైగా కావడంతో, గాయకుడి వయసు పెరగడంతో స్వరంలో మార్పులు రావడం సహజమేనని చెప్పారు.

ఒరిజినల్ పాటకు, దాన్ని పాడిన గాయకుడికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే డప్పు శ్రీనుతో ఈ పాటను పాడించినట్లు శివ నిర్వాణ స్పష్టం చేశారు. పాటను కొత్తగా అందించే క్రమంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా, ‘ఇరుముడి’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.

Spread the love

Related News

Latest News