[t4b-ticker]

పాదయాత్రతో బయటపడ్డ బిఆర్ఎస్ విభేదాలు

పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్న తిరుపతిరెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 30: మెదక్ నియోజకవర్గం లోని నిజాంపేట మండలం నంది గోకుల్ నస్కల్ చల్మెడ గ్రామాల ఉన్న రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రకు మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు కoటారెడ్డి తిరుపతిరెడ్డి అతని అనుచరులు ఈ పాదయాత్రలో పాల్గొనలేరు వారి జాడ సైతం కనబడలేదు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గం నేతలు సయోధ్య లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు సైతం దూరమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పద్మ దేవేందర్ రెడ్డి. మూడు గ్రామాలకు చెందిన ప్రజల కొరకు పాదయాత్ర చేపట్టి గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారం కొరకు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తే తిరుపతి రెడ్డి వర్గం ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం పైన ప్రజలు రాజకీయ విశ్లేషకులు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అందుకే తిరుపతిరెడ్డి పాదయాత్రలో పాల్గొనలేకపోయాడని ప్రజలు భావిస్తున్నారు దీంతో మరోసారి పార్టీలో ఉన్నవి విభేదాలు బయటకు వచ్చాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చిన నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి చాలా కార్యక్రమాలకు హాజరు కాలేకపోవడంపై పార్టీలో విభేదాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు ప్రజలు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News