[t4b-ticker]

జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 16: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జరిగిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను సీఎం ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

బిచ్కుందలో నిర్వహించిన ఈ వివాహ రిసెప్షన్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాబోయే వధూవరులతో కొద్దిసేపు ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీవితంలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎం పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది

Spread the love

Related News

Latest News