కార్తీక మాసం సందర్భంగా జగిత్యాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సు.

జగిత్యాల డిపో మేనేజర్, రమేష్.

ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) నవంబర్, 14: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యే కంగా జగిత్యాల ఆర్టీసీ డిపో, ఆధ్వర్యంలో ఈ నెల 22, న అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ ఆధ్యాత్మిక యాత్ర బస్సును నడపనున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా భక్తులకు “కాణి పాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి” ఆలయం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణా మలై,లోని శ్రీ అరుణాచలే శ్వర స్వామి ఆలయం మరి యు గద్వాల్ జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొ న్నారు.ఈ నెల 22, వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12:30, గంటలకు జగిత్యాల ఆర్టీసీ డిపో నుండి ఈయాత్ర ప్రారంభమై కరీంనగర్, సిద్ది పేట, హైదరాబాద్ మీదుగా వెళ్తుందని వివరించారు. 23, వ తేదీ ఉదయం కాణిపాకం, సాయంత్రం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 24, న వేకువజామున అరు ణాచలం చేరుకుంటుందని తెలిపారు.

24, వ తేదీ రాత్రి అరుణాచలేశ్వర స్వామి దర్శనానంతరం బయలు దేరి,25,న ఉదయం గద్వాల్ జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని అదే రోజు రాత్రి తిరిగి జగిత్యాల చేరు కుంటుందని వెల్లడించారు. ఈ నాలుగు పుణ్యక్షేత్రాల యాత్రకు పెద్దలకు రూ. 4,800, పిల్లలకు రూ. 3,750, టికెట్ ధరగా నిర్ణ యించినట్లు తెలిపారు. ఆలయాల్లోని దర్శన టికెట్లు మరియు భోజన ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. ఆసక్తి గల భక్తులు ముందస్తు రిజర్వేషన్ (OPRS, నంబర్: 95500) కోసం 9440281672, 9440521412, 9959225925, 9959262620, నంబర్లను సంప్రదించి సీట్లు బుక్ చేసు కోవాలని ఆర్టీసీ డిపో, మేనేజర్ రమేష్ సూచించారు.

Related News

Latest News