కింగ్ నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి కర్ణగా అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రతిపక్షం, నవంబర్ 08: కింగ్ నాగార్జున అక్కినేని కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ ప్రాజెక్ట్‌ ‘కింగ్ 100’, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పాత్రను పరిచయం చేయడంపై అంచనాలు పెంచుతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కర్ణగా ఆయనలోని వైల్డ్‌నెస్‌ను ప్రజెంట్ చేస్తూ ఈ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పూర్తి ఇంటెన్స్ అవతార్‌లో అశోక్ సెల్వన్ అదిరిపోయారు. స్టైలిష్ మెరూన్ షర్ట్, పొడవాటి జుట్టు, ఒత్తైన గడ్డంతో కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చున్న ఆయన లుక్‌లో అటిట్యూడ్ కనిపిస్తోంది. చేతిలో సిగరెట్, పక్కనే సాధారణంగా ఉంచిన ఖాకీ పోలీస్ యూనిఫామ్, ముందు భాగంలో ప్రముఖంగా కనిపిస్తున్న కింగ్ మూవ్ తో కూడిన చెస్ బోర్డు.. పోస్టర్‌కు మరిన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించాయి. డార్క్ సెటప్ పోస్టర్‌లోని మిస్టీరియస్ అప్పీల్‌ను మరింత పెంచాయి.

అశోక్ సెల్వన్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఆయనను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో పరిచయం చేశారు. ఈ పాత్ర కోసం ఆయనలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ ‘కింగ్ 100’కు మరో ఆసక్తికరమైన కోణాన్ని జోడించింది. ఈ ఫస్ట్ లుక్‌తో కర్ణ పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఆయన పాత్ర ఎలాంటి ప్రభావం చూపించనుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

నాగార్జున, టబు, అశోక్ సెల్వన్ వంటి వెర్సటైల్ స్టార్స్ భాగమైన ‘కింగ్ 100’ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: కింగ్ నాగార్జున, టబు, అశోక్ సెల్వన్

Related News

Latest News