మహాచండి (కూష్మాండ) దేవి రూపంలో వనదుర్గమ్మ దర్శనం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 14: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజు అమ్మవారిని మహాచండి (కూష్మాండ) దేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.





























