జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కు వినతి

ప్రతిపక్షం ప్రతినిధి కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్28: ఆసిఫాబాద్ జిల్లాలోని జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య అభివృద్ధి కోసం తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని శనివారం హైదరాబాద్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ వినతి పత్రం అందజేశారు. టియుడబ్ల్యూ జే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన అబ్దుల్ రహమాన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అబ్దుల్ రహమాన్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ
రాష్ట్రంలోనే మారుమూల, భౌగోళికంగా వెనుకబడిన ప్రాంతమైన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆధునిక జర్నలిజంపై శిక్షణ అవసరమని, డిజిటల్ జర్నలిజం, మొబైల్ జర్నలిజం, సోషల్ మీడియా వినియోగం, వార్తా సేకరణలో ఆధునిక పద్ధతులు, పరిశోధనాత్మక జర్నలిజం, మీడియా నైతిక విలువలు, చట్టపరమైన అంశాలపై నిపుణులతో శిక్షణ అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Related News

Latest News