రైతాంగాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి
వంటావార్పులో పాల్గొని వంట చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 03: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మెదక్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంటావార్పు నిర్వహిస్తూ స్వయంగా వంట చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.































