[t4b-ticker]

ఉదయనిధి అరెస్టుపై విశాల్ స్పందన.. ‘రాజకీయాల్లో ఇలాంటివి సహజం’

ప్రతిపక్షం, ఆగస్టు 07: నటుడు, తమిళ సినీ నిర్మాత విశాల్ ఉదయనిధి స్టాలిన్ అరెస్టు అంశంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఉదయనిధి ప్రసంగాన్ని పూర్తిగా విన్నానని, ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని అన్నారు.

అయితే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజల ముందుకు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విశాల్ సూచించారు. రాజకీయాల్లో ప్రతి వ్యాఖ్యకు భిన్నమైన అర్థాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

లయోలా కాలేజీలో విజయ్ తన సీనియర్ కాగా, ఉదయనిధి తన బ్యాచ్‌మేట్ అని గుర్తు చేసిన విశాల్, వారిద్దరూ రాజకీయాల్లో ఉండటంతో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, రాజకీయాల్లో ఇవి సహజమేనని వ్యాఖ్యానించారు.

త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఉదయనిధి అరెస్టు కావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News