[t4b-ticker]

ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ‘పనులు చేయడం మానేస్తున్నారు’

ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఎలాంటి సందేశం ఇస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది.

రైతుబంధు వంటి పథకం ఉద్దేశం మంచిదేనని పేర్కొన్న హైకోర్టు, అయితే ఆ పథకం ద్వారా కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించింది. నిజంగా అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రభావంతో ప్రజల్లో పని చేసే ధోరణి తగ్గుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు కూడా దొరకడం లేదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, సంక్షేమ పథకాల అమలులో సమతుల్యత అవసరమని అభిప్రాయపడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజమైన అర్హులకు చేరేలా, అదే సమయంలో ఉపాధి సంస్కృతిపై ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు ఉండాలని సూచించింది.

Spread the love

Related News

Latest News