జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 11: దేశంలో చేపట్టే జన గణనలో ఓబీసీ ల కులగనన చేపట్టాలని బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో చేపట్టే జన గణన లో ఓబీసీ ల కులగనన చేపడుతామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ హామీ ఇచ్చిందని కానీ ఇప్పుడు మాత్రం ఆ హామినీ విస్మరిస్తుందని తెలిపారు. తక్షణమే ఓబీసీలోని ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయని కానీ ఓబీసీలకు మాత్రం న్యాయమైన కోరిక అయిన వారి కులాలకు మాత్రం లెక్కలు లేవని అన్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు మద్దతుగా తెలియజేసారు. ఓబీసీ కులగణన చేయని పక్షంలో ఓబీసీలా నిరసన కేంద్ర ప్రభుత్వం పై కాకుండా బీజేపీ పార్టీ పైనే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమలో రాష్ట్ర ప్రధాన కారుల్యదర్శి రంగు సంపత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారీ, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి జి ఎస్ ఆనంద్,మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు ఐల ప్రసన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషి, జిల్లా ఉపాధ్యక్షురాలు వీరగోని వరలక్ష్మి, సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్,ఎడ్ల సురేందర్, పెంట శ్రీనివాస్,బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గజే ప్రజ్యోత్, బియ్యని తిరుపతి,జిల్లా అధికార ప్రతినిధి దుంపటపల్లి మురళి, బండారి మల్లయ్య, దిలీప్,తిప్పరపు శ్రీనివాస్,సుధాకర్, ఆకుల సురేష్, ఆశిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





























