కస్తాల వార్డు మెంబర్ల ఫోరం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

*మునుగోడు ఇంచార్జ్ బొమ్మరబోయిన కవిత ఆధ్వర్యంలో ఎన్నిక.

*అధ్యక్షులుగా ఎన్నికైన దోనాల శ్రీనివాసరెడ్డి.

ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 27 : చండూరు మండలంలోని కస్తాల గ్రామంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. గ్రామ అభివృద్ధి, వార్డ్ మెంబర్ల ఐక్యత, పాలకవర్గ పటిష్టత కోసం ఏర్పాటు చేసిన కస్తాల పాలకవర్గ వార్డ్ మెంబర్ల ఫోరం గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గ్రామంలోని వార్డ్ మెంబర్లు అందరి సమక్షంలో జరిగిన ఈ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అందరి ఏకాభిప్రాయంతో నూతన కమిటీని ఎంపిక చేశారు.

ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా సీనియర్ వార్డు మెంబర్ మెరుగు అంజయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన అనుభవం, గ్రామం పట్ల ఉన్న అవగాహన కమిటీకి మార్గదర్శకంగా ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
కస్తాల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగాదోనాల శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధిపై ఆయనకున్న పట్టుదల, చురుకుదనం కమిటీని ముందుకు నడిపిస్తాయని అందరూ విశ్వసిస్తున్నారు.ఉపాధ్యక్షులుగా ఇద్దరు మహిళా నాయకురాళ్లు – గురిజాల రమ్య, బొమ్మరబోయిన పావని ఎన్నిక కావడం విశేషం. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారికి ఈ బాధ్యతలు అప్పగించారు.ప్రధాన కార్యదర్శిగా కట్ట సైదులు, కోశాధికారిగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.సలహాదారులుగా ముగ్గురు – బొమ్మరబోయిన కవిత, బండి శోభ, అమలూరి అశోక్ లను నియమించారు. వీరు కమిటీకి సలహాలు, సూచనలు ఇస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడనున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దోనాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కస్తాల గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, వార్డ్ మెంబర్లందరినీ కలుపుకుని, రాజకీయాలకు అతీతంగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు తదితర మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.గౌరవ అధ్యక్షుడు మెరుగు అంజయ్య మాట్లాడుతూ, అందరి సహకారంతో కస్తాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News