[t4b-ticker]

తుంగతుర్తి పంచాయితీపై పీసీసీ చీఫ్‌కు జగ్గారెడ్డి నివేదిక.. 9 పేజీల్లో పూర్తి వివరాలు

ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిన తుంగతుర్తి పంచాయితీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నివేదికను పీసీసీ చీఫ్‌కు సమర్పించారు. మొత్తం 9 పేజీలతో కూడిన ఈ నివేదికలో తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ అంతర్గత పరిణామాలు, స్థానిక నేతల అభిప్రాయాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.

నివేదిక తయారీలో భాగంగా సంబంధిత నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో జగ్గారెడ్డి విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు స్థానిక స్థాయిలో ఎంతవరకు అమలయ్యాయి, వాటిని నాయకులు పాటించారా లేదా అనే అంశాలను కూడా నివేదికలో స్పష్టంగా ప్రస్తావించినట్లు సమాచారం.

తుంగతుర్తి వ్యవహారంలో నెలకొన్న విభేదాలు, పార్టీ క్రమశిక్షణ, భవిష్యత్ కార్యాచరణపై కూడా జగ్గారెడ్డి తన అభిప్రాయాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం పార్టీ అధిష్టానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love

Related News

Latest News