ప్రతిపక్షం, ఆగస్టు 28: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో మంత్రి భేటీకి ప్రయత్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాఖీ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి రాఖీ కట్టేందుకు కొంత సమయం కేటాయించాలని మంత్రి సురేఖ కోరినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
ముఖ్యమంత్రి, మంత్రి మధ్య భేటీ జరిగితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి కోరిన అపాయింట్‌మెంట్‌పై సీఎంవో నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





























