*కన్నుల పండువగా సాగిన అమ్మవారి శోభయాత్ర
*ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్ర – మహిళలు, యువతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 21: చండూరు మండలం కస్తాల గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్ర బుధవారం ఘనంగా, కన్నుల పండువగా జరిగింది.శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని రామాలయం గుడి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ కనక దుర్గాదేవి మాత కు గత తొమ్మిది రోజుల పాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు ముగియడంతో బుధవారం నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహన్ని గంగమ్మ ఒడికి తరలించారు.ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి కస్తాల గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేశారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు.”జై దుర్గా భవానీ” నినాదాలతో, డప్పు వాయిద్యాలు, భక్తి పాటల నడుమ సాగిన ఈ శోభాయాత్రను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అనంతరం దుర్గాదేవి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చడానికి తీసుకెళ్లారు . ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






























