*ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తప్పనిసరి – కమిషనర్ ఎల్. మల్లేశం
*చండూరు మున్సిపల్ కేంద్రంలో ఎల్ నినోపై అవగాహన సదస్సు.
ప్రతిపక్షం చండూరు నవంబర్ 03: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం (03.11.2026) ఉదయం 11:00 గంటలకు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
*నీటి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: చైర్మన్
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ..
ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలి. భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించాలి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఆపివేసి విద్యుత్ ను ఆదా చేయాలి. నీటి పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
*లీకేజీలను అరికట్టండి: కమిషనర్
మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ.. ఎల్ నినో అంటే ఏమిటి, దాని ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు, వర్షపాతం మరియు ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల గురించి ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.
- ఇళ్లలో నల్లాలు, పైప్ లైన్ల వద్ద లీకేజీలు లేకుండా చూసుకోవాలి.
- వాహనాలు కడగడానికి, ఇంటి ముందు కడగడానికి తాగునీటిని వాడరాదు.
- వాడిన నీటిని మొక్కలకు, తోటల పెంపకానికి తిరిగి వినియోగించుకోవాలి.
- నినాదం: “నీటిని ఆదా చేద్దాం – భవిష్యత్తును కాపాడుదాం”.
- పట్టణ ప్రజలందరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






























