చండూరులో అంగరంగ వైభవంగా దుర్గామాత శోభాయాత్ర – అమ్మవారికి ఘనంగా నవరాత్రులు పూజలు.

*వివిధ వార్డులలో పూజలు అందుకున్న దుర్గామాత .

*ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి .

*ఎల్ నినో కరువు నుండి ప్రజలను కాపాడాలని ప్రార్థించిన – చైర్మన్

*శోభాయాత్రలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

ప్రతిపక్షం చండూరు అక్టోబర్ 22: చండూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో నవరాత్రి పూజలు అందుకున్న దుర్గా మాత అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు గారు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ గారు, 7వ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మ వెంకన్న గారు, 2వ వార్డు కౌన్సిలర్ బుషిపాక వాసు గారు, చండూరు పట్టణ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐతరాజు మల్లేష్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ… “ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు చండూరు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల నుండి, వర్షాభావ పరిస్థితుల నుండి ఆ అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. అలాగే ప్రజలందరూ నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు నీటిని, ఆహార పదార్థాలను, నిత్యవసర సరుకులను అవసరమైనంత మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని, వృధా చేయవద్దని సూచించారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి జై కొడుతూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగారు.

Spread the love

Related News

Latest News