*ఉడుత్తలపల్లిలో వీబీజీ రాంజీ పనుల పరిశీలన.
*వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి పనులకు రండి.
*పూర్తి వేతనం రూ.307 పొందండి – కూలీలకు పిలుపు.
ప్రతిపక్షం – చండూరు, అక్టోబర్ 27: వీబీజీ రాంజీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు ఎంపీడీవో యాదగిరి పిలుపునిచ్చారు.మండలంలోని ఉడుత్తలపల్లిలో జరుగుతున్న పనులను ఎంపీఓ కోటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలందరూ ఉపాధి హామీ పనులకు హాజరు కావాలని, నిర్దేశించిన కొలతల ప్రకారం సమష్టిగా పని చేసి పూర్తి వేతనం రూ.307 పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, మేట్లు, గ్రామ కూలీలు పాల్గొన్నారు.





























