[t4b-ticker]

సమావేశానికి అనుమతి లేదుజర్నలిస్టులను అవమానించిన మున్సిపల్ కమిషనర్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 30: మెదక్ మున్సిపల్ పాలకవర్గ సర్వసభ్య సమావేశానికి మెదక్ జర్నలిస్టులను అనుమతించకపోవడం పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రజల సమస్యలను అభివృద్ధిపై మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ లు చర్చించ వేదిక మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం అలాంటి సమావేశానికి మెదక్ జర్నలిస్టులను అనుమతించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. మున్సిపల్ సమావేశం లో కీలక భేటీలో అంత రహస్యం ఏముందనే చర్చ ఇప్పుడు స్థానిక పట్టణ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గురువారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జరుగు సమావేశానికి కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడం కలకలం రేపింది. సాధారణంగా ఏ మున్సిపల్ సమావేశం జరిగానా, దానికి సంబంధించిన ఎజెండా ప్రతిని ముందే మీడియాకు అందించడం ఆనవాయితీగా వస్తోంది.

వార్డుల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాలు, కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు మీడియా ద్వారానే ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. కానీ, ఉన్నపళంగా ఈ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ జీవో ప్రకారం మీడియాను అనుమతించడం లేదని అధికారులు చెబుతున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏ ఇతర మున్సిపాలిటీలో లేని జీవో, ఒక్క మెదక్ మున్సిపాలిటీకే ఎలా వర్తిస్తుందని కౌన్సిలర్లు, స్థానికులు నిలదీస్తున్నారు. ప్రజలకు తెలియకూడని రహస్య చర్చలు, నిర్ణయాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం స్పందించి పారదర్శకంగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Spread the love

Related News

Latest News