బతుకమ్మ ఆటలతో నిరసన
మహిళా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 05: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మహిళా వ్యతిరేకి అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని అన్నారు పింఛన్లు పెంచుతామన్నారు.. పెంచలేదు! విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదుని మహిళలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మహిళా వ్యతిరేకి ప్రభుత్వ పని ఆమె అన్నారు.ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యంలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.. లేదంటే ప్రజల తరఫున బీఆర్‌ఎస్ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






























