*చౌటుప్పల్ బ్రతుకమ్మ వేడుకల్లో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి .
ప్రతి పక్షం చౌటుప్పల్ 09: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి గారు హాజరై విద్యార్థులతో కలిసి ఆడి పాడారు, మహిళలందరూ ఒకచోట చేరి భక్తిశ్రద్ధలతో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం, పూలను దేవతలా భావించి పూజించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమన్నారు. మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం తెలియజేసేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు.
ప్రతి ఒక్కరూ ఈ దసరా సెలవుల్లో గ్రామాలకు వెళ్లి నానమ్మ అమ్మమ్మ లు చెప్పే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని విద్యార్థినులను ఉద్దేశించి అన్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా ఈ తరం పిల్లలకు మన పండుగల గొప్పతనాన్ని సాంప్రదాయాలను సంస్కృతులను తెలియజేయడం మంచి పరిణామం అన్నారు . దేవుడిచ్చిన శక్తితో మా ఊపిరి ఉన్నంతవరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సమాజానికి పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు.ఈ బతుకమ్మ వేడుకల్లో కోమటిరెడ్డి లక్ష్మి తో పాటు చౌటుప్పల్ మున్సిపల్ పాలకవర్గ మహిళలు, పుర మహిళలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


































