*అయ్యప్ప ఆలయ అభివృద్ధికి మరో రూ.10 లక్షల విరాళం .
*సతీమణి లక్ష్మి గారితో కలిసి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్న ఎమ్మెల్యే.
*ఇప్పటికే రూ.20 లక్షలు ఇచ్చా, ఈరోజు మరో రూ.10 లక్షలు ఇస్తున్నా
*గుడి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
*దైవం విషయంలో రాజకీయాలు, కులం లేదు, మనందరం ఒకటే .
*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
ప్రతి పక్షం చండూరు నవంబర్ 16: చండూరులో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అయ్యప్ప దీక్షలో సతీసమేతంగా పాల్గొన్నారు.అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన తన సతీమణి శ్రీమతి లక్ష్మితో కలిసి యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…
చండూరులో శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరం. గుడి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రెండు రోజుల క్రితం నా వంతుగా రూ.20 లక్షలు ఈ గుడికి సహకారం చేశాను. ఈరోజు మరో రూ.10 లక్షలు సహాయం చేస్తున్నాను అని అన్నారు . అంటే మొత్తం రూ.30 లక్షల రూపాయలను తన వంతుగా ఆ భగవంతుని సన్నిధిలో ఇవ్వడం తో నా జన్మ ధన్యమైందని అన్నారు .
భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది అందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. విరాళాలు అందించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.దేవుడు కొందరివాడు కాదు, అందరివాడు. దైవం విషయంలో రాజకీయాలు, కులం అనేది లేదు, మనందరం ఒకటే. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























