ప్రతిపక్షం, ఆగస్టు 06: ఇటీవల మొబైల్ ఫోన్ వినియోగదారులు కాల్స్ సమయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్ కనెక్ట్ అయిన వెంటనే తొలి రెండు సెకన్ల పాటు అవతలి వ్యక్తి వాయిస్ వినిపించకపోవడం, మధ్య మధ్యలో వాయిస్ కట్ అవడం, మాటలు స్పష్టంగా వినిపించకపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ఈ సమస్య ఒక్క టెలికాం సంస్థకే పరిమితం కాకుండా, దాదాపు అన్ని ప్రధాన టెలికాం కంపెనీల వినియోగదారుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఇది నెట్‌వర్క్ సంబంధిత లోపమా? లేక సాంకేతిక అప్‌డేట్ల ప్రభావమా? అనే చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఈ సమస్యపై టెలికాం సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కాల్ డ్రాప్‌లు, వాయిస్ ఆలస్యం వంటి అంశాలపై వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మీ ఫోన్‌లో కూడా కాల్ చేసిన వెంటనే వాయిస్ ఆలస్యంగా వినిపించడం లేదా మధ్యలో కట్ అవుతున్న సమస్య ఉందా? మీ అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.

















