[t4b-ticker]

బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టాలి ఏబీవీపీ డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 04: రామాయంపేట జాతీయ రహదారి జంక్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించాలని ఏబీవీపీ స్టేట్ ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ తెలిపారు మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి అంబాదాసు కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి లేకపోవడంతో మాడల్ స్కూల్ విద్యార్థులు రామాయంపేట కు వస్తున్న క్రమంలో లారీ ఢీకొనడంతో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయని అందులో ఐదు మంది విద్యార్థులు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఆయన తెలిపారు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని నేడు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అని వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని మన తెలిపారు ఇట్టి విషయంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు బ్రిడ్జి నిర్మాణం కోసం 47 కోట్ల 21 లక్షల నిధులతో వై జంక్షన్ సాంక్షన్ అవ్వడం జరిగింది కావున దీనిని అతి త్వరగా పూర్తి చెయ్యవలసిందిగా ఎమ్మెల్యే ఎంపీ చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు సంతోష్ కాశినాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News