*మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు.. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్.
*చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు లో నీటి కొరత సమస్యను పరిష్కరించాలి.
*సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్.
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 19: చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు లో త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని సిపిఐ చండూర్ సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నలపరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ 3 వ వార్డు లో గత 3 నెలల త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రజలు కనీసం వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన మున్సిపాలిటీ సమస్య పట్ల నిర్లక్ష్య వహించడం సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు.అధికారులు తక్షణమే నీటి సరఫరా సమ్యస పై దృష్టి సారించి పరిష్కరించాలని లేనీ యెడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు 4 వార్డు కౌన్సిలర్ జెల్లా ధనమ్మ శ్రీనివాస్ దోటి వెంకన్న నాయకులు దోటీ యాదయ్య,గడ్డం నవీన్,అందిర్క పరమేష్,కురుపాటి పరమేష్, మహిళలు సాలమ్మ,, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.





























